Gaddar Last Rites: గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ఒకరు మృతి..
Gaddar Last Rites: గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ఒకరు మృతి..
Gaddar Last Rites: ప్రజాగాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. గద్దర్ నివాసం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి లక్డికపూల్‌కు చెందిన అభిమానిగా గుర్తించారు. తొక్కిసలాట జరిగిన అనంతరం బాధితుడిని కొందరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఓ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ గా తెలుస్తోంది. గద్దర్ పార్థివ దేహాన్ని ఆయన ఇంటి నుంచి మహాబోధి స్కూల్ ఆవరణకు తరలించారు.