NIT Warangal Recruitment: వరంగల్ నీట్ లో 56 ఉద్యోగాలకు ఖాళీలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. రేపే చివరి తేదీ
NIT Warangal Recruitment: వరంగల్ నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జనవరి 7వ తేదీతో పూర్తి అవుతుంది. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి వరంగ్ లోని నిట్ ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 56 ఖాళీలకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్, డిప్యూటేషన్ ప్రాతిపదికన ఈపోస్టులను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనిలో అత్యధికంగా ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. కొన్ని పోస్టులకు అయితే రూ. 500 నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రూప్ ఏ, బీ, సీ కేటగిరీలుగా పోస్టులు ఉన్నాయి.
అర్హతలు చూస్తే పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. 56ఏళ్లు మించి ఉండకూడదు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దీనికి సంబంధించి వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారం ఎంపిక ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక వెబ్ సైట్ https://nitw.ac.in/careees/లో వివరాలను అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా recruit_admn@nitw.ac.inకు మెయిల్ చేయవచ్చు. సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే recruit@nitw.ac.inకు మెయిల్ చేయవచ్చు.