Formula E Race Case: కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నాయకుల క్యూ, లీగల్ నిపుణులతో చర్చ
Formula E Race: ఫార్మూలా ఈ కారు రేసు కేసు విషయంలో తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నాయకులు క్యూ కట్టారు.
Formula E Race: ఫార్మూలా ఈ కారు రేసు కేసు విషయంలో తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నాయకులు క్యూ కట్టారు. నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు చేరుకున్నారు. తన న్యాయనిపుణులతో కేటీఆర్ చర్చిస్తున్నారు. తాజా తీర్పుపై హైకోర్టు పుల్ బెంచ్ ను ఆశ్రయించాలా.. లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాలా అనే దానిపై కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు.
కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చే ఛాన్స్
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున విచారణకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ ఈడీ అధికారులకు లేఖ పంపారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు జనవరి 6నే ఏసీబీ నోటీసులు జారీ చేసింది.