ఆయన జేపీ నడ్డా కాదు అబద్దాల అడ్డా అంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాపై సెటైర్ వేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కర్నాటక తరహా ఆటలు ఇక్కడ చేద్దామంటే కుదరదంటూ ఘాటుగా రిప్లయి ఇచ్చారు. హైదరాబాద్ పర్యటనలో తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క చోట అయినా నెలకు రెండు వేల ఫించన్ అందిస్తున్నారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు.