Formula E Race Case: ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా, లేఖ ఇచ్చి వెనుదిరిగిన కేటీఆర్
Formula E Race Case: ఫార్మూలా -ఈ కారు రేసు కేసులో సోమవారం ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది.
Formula E Race Case: ఫార్మూలా -ఈ కారు రేసు కేసులో సోమవారం ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది.కేటీఆర్ ను లాయర్లతో ఏసీబీ విచారణకు అనుమతివ్వనందున ఆయన తిరిగి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పార్మూలా ఈ కారు రేసు కేసులో విచారణకు రావాలని ఏసీబీ అధికారులు ఈ నెల 3న నోటీసు పంపారు. ఈ నోటీసు ఆధారంగా కేటీఆర్ ఇవాళ విచారణకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అడ్వకేట్ తో కలిసి ఏసీబీ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ ను అధికారులు అనుమతించలేదు.
అడ్వకేట్ ను అధికారులు అనుమతించలేదు. కోర్టు మాత్రం అడ్వకేట్ ను అనుమతించాలని ఆదేశాలివ్వలేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఏసీబీ కార్యాలయం వద్ద 45 నిమిషాలు కారులోనే కూర్చొన్నారు. చివరకు ఏసీబీ కార్యాలయంలో అధికారులు ఓ లేఖ అందించారు. అడ్వకేట్ తో కలిసి విచారణకు అనుమతిస్తే తాను విచారణకు వస్తానని ఆ లేఖలో తెలిపారు. ఈ లేఖను ఇచ్చిన తర్వాత ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లారు.
ఏసీబీకి కేటీఆర్ ఇచ్చిన లేఖలో ఏముందంటే?
ఫార్మూలా ఈ కారు రేసులో కచ్చితమైన డాక్యుమెంట్లు, సమాచారం ఇవ్వాలని నోటీసులో కోరలేదని కేటీఆర్ సోమవారం ఏసీబీకి ఇచ్చిన లేఖలో తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన తీర్పు కూడా రిజర్వ్ చేసి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో తాను చెప్పాలనుకున్న అంశాన్ని లేఖ రూపంలో ఇచ్చి ఆయన వెళ్లిపోయారు.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ పై 2024 డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను ఏ1 గా చేర్చారు. ఏ 2 గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్,ఏ3 గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.