Gaddar Funeral: ప్రజా యుద్ధనౌక గద్ధర్ అంత్యక్రియలు ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోది స్కూల్ గ్రౌండ్‌లో బౌద్ద సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. గద్దర్ కడసారి చూపు కోసం కళాకారులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి వెళ్లి.. ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అంతకముందు 6 గంటల పాటు హైదరాబాద్‌లో 17 కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కళాకారులు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.