Siddipet: 23 రోజుల చిన్ని 'గుండె'కు సీపీఆర్.. పసి ప్రాణాన్ని కాపాడిన 108 సిబ్బంది

TS News: చిన్నారిని కాపాడిన 108 సిబ్బంది

Update: 2023-04-06 03:17 GMT

Siddipet: 23 రోజుల చిన్ని 'గుండె'కు సీపీఆర్.. పసి ప్రాణాన్ని కాపాడిన 108 సిబ్బంది

Siddipet: సిద్దిపేట జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. స్నానం చేయించేటప్పుడు నీళ్లు మింగడంతో 23 రోజుల పసికందుకు శ్వాస ఆగిపోయింది. దీంతో వైద్య సిబ్బంది సీపీఆర్‌ చేసి పాప ప్రాణాలను కాపాడారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చద్లాపూర్‌లోని మెగా క్యాంప్‌ కార్యాలయంలో బిహార్‌కు చెందిన దంపతులకు ఆడ శిశువు జన్మించింది. రోజు మాదిరిగానే ఆ పాపకు స్నానం చేయిస్తుండగా నీళ్లు మింగి పాప శ్వాస ఆగిపోయింది.

బిడ్డ చలనం లేకుండా ఉండటంతో వెంటనే ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌కు సమాచారం అందించింది. వెంటనే వాళ్లు 108 నంబర్‌కి ఫోన్‌ చేశారు. హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది పాపను పరీక్షించారు. పాప గుండె, నాడి కొట్టుకోవడం లేదని గమనించిన సిబ్బంది వెంటనే సీపీఆర్‌ చేశారు. దీంతో పాప స్పృహలోకి వచ్చింది. వైద్యుల సూచన మేరకు పాపను సిద్దిపేట జిల్లా దవఖానాకు తరలించారు. సమయానికి స్పందించి పాప ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బందికి కుటుంబసభ్యులు, బంధువులు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News