కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసిందా... ఈ ప్రచారంలో నిజమెంత?

Formula E Race Case: కేటీఆర్ ఇంట్లో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సోదాలు చేశారనే ప్రచారంలో వాస్తవమేనా.. అధికారులు ఏమన్నారు..

Update: 2025-01-06 11:35 GMT

 కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసిందా... ఈ ప్రచారంలో నిజమెంత?

Formula E Race Case: కేటీఆర్ ఇంట్లో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా కథనాలు ప్రసారమయ్యాయి. అయితే, అందుకు సంబంధించిన అధికారిక సమాచారమేమీ లేదు. నిజానికి, అలాంటి సోదాలేవీ జరగలేదని కేటీఆర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.కాగా, ఈ ఉదయం ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిన కేటీఆర్, తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు.

ఫార్మూలా ఈ కారు రేసులో 2024 డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 గా కేటీఆర్, ఏ 2 అరవింద్ కుమార్, ఏ3 గా బీఎస్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ ను ఈడీ ఆదేశించింది.

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వచ్చే వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ జనవరి 6న హాజరుకావాలి. కానీ, అడ్వకేట్ ను అనుమతివ్వని కారణంగా ఆయన విచారణకు వెళ్లలేదు. ఏసీబీకి ఆయన లేఖను ఇచ్చి వెళ్లిపోయారు.ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై ఏసీబీ  విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.  ఏసీబీ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.

Tags:    

Similar News