Formula E Car Race: కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు
బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఏసీబీ అధికారులు (ACB) మరోసారి నోటీసులు ఇచ్చారు. జనవరి 9న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు.
Formula E Car Race: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఏసీబీ అధికారులు (ACB) మరోసారి నోటీసులు ఇచ్చారు. జనవరి 9న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. జనవరి 6న విచారణకు అడ్వకేట్ తో కలిసి విచారణకు ఆయనకు అనుమతివ్వలేదు.దీంతో ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు.
గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాలో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఫార్మూలా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించేందుకు నోటీసులు ఇచ్చారు. ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.
ఫార్మా ఈ కారు రేస్ కు సంబంధించి నిబంధనలు పాటించకుండా విదేశీ కరెన్సీ రూపంలో నిధులను బదలాయించడంతో పాటు అగ్రిమెంట్ కు ముందే నిధులను ఈఎఫ్ఓ సంస్థకు ఇచ్చారని ప్రభుత్వం వాదన. అయితే ప్రభుత్వ వాదనలను కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు.
అసలు అవినీతే జరగనప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న తీర్పును హైకోర్టు వెలువరించనుంది. అయితే ఈ తీర్పును వెలువరించే వరకు కేటీఆర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపింది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణకు హజరయ్యేందుకు సమయం ఇవ్వాలని కేటీఆర్ ఈడీకి లేఖ రాశారు.