ఏక్షణమైనా కన్నా అరెస్టు..?
గురజాలలో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే, ఆ పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఎటువంటి పరిస్థితుల్లోనూ సభ నిర్వహిస్తామంతున్నారు. దీంతో పోలీసులు కన్నాను అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనికి ఆ పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరుకావలసి ఉంది. అయితే, ఆయన పయనానికి ముందే ఈ ఉదయం గుంటూరులోని ఆయన నివవాసం హైడ్రామ నడిచింది. కన్నా వద్దకు గురజాల సీఐ రామారావు చేరుకుని ఆయనకు నోటీసులు అందించారు. గురజాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, యాక్ట్ 30కూడా అమలులో ఉందని తెలిపారు. గురజాల సీఏ ఇచ్చిన నోటీసులను తీసుకోవడానికి కన్నా నిరాకరించారు. దీంతో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కన్నా రాకను అడ్డుకుంనేదుకు సత్తెనపల్లి, పిడుగురాళ్ల రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఏక్షణమైనా కన్నాను అరెస్టు చేయనున్నట్లు సమాచారం.