Venkaiah Naidu: చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ పెంచుకోవాలి
Venkaiah Naidu: చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ పెంచుకోవాలి
Venkaiah Naidu: విద్యార్థులు మార్పు రావాలని, చదువుకోడంకాదు... ఇతరులకు చదువు నేర్పించే స్థాయికి ఎదగాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. చైతన్య డీమ్డ్ బి యూనివర్శిటీ 11వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్ధేశించి హితోపదేశం చేశారు. చదువుతోపాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలన్నారు. సంపదపెంచి... ఇతరులకు పంచాలన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం మన సాంప్రదాయాలను గుర్తుకు తెస్తుందన్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్య మొదలు పెట్టాలని, ఆంగ్ల భాషపై పట్టు సాధించి ప్రజ్ఞావంతులుగా రాణించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఇప్పటి రాజకీయాలు రోతపుట్టిస్తున్నాయని, రాజకీయాల్లో మార్పుకోసం యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.