Supreme Court: పెన్షనర్లకు, న్యాయమూర్తులకు జీతాలుండవు..ఉచితాలకు డబ్బులుంటాయా?..రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Supreme Court: ఉచితాల పేరుతో పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ..న్యాయవాదులకు, పెన్షనర్లకు జీతాలు ఇచ్చేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డువస్తాయని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
పనిచేయని వారికి ఉచితాల పేరుతో డబ్బులు పంచుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చురకలంటించింది. పనిచేయనివారికి పంచేందుకు డబ్బులు ఉంటాయి కానీ జిల్లా న్యాయవ్యవస్థలోని జడ్జీలకు జీతాలు, పెన్షనర్లకు ఇచ్చేందుకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు అడ్డువస్తాయంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహెన్ తోపాటు ఇతర స్కీములను ప్రకటించి కచ్చితమైన సొమ్మును పంచిపెడుతుంటారు.
ఢిల్లీలో ఇప్పుడు ఒక పార్టీ రూ. 2500 ఇస్తామంటే మరోపార్టీ మరికొంత ఇస్తామంటుంది అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. రిటైర్మ్ మెంట్ చేసిన జడ్జీలకు పెన్షన్లపై 2015లో అఖిలభారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. న్యాయాధికారుల జీతాలు, పదవీవిరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణలోనికి తీసుకుంటుందని ఈ సందర్బంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.