Delhi Assembly Election 2025: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, పోలింగ్ డేట్ ఎప్పుడంటే?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో దిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది.
Delhi Assembly Election 2025: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు.ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు.ఈ ఏడాది ఫిబ్రవరి 15తో దిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది.ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈవీఎం హ్యాకింగ్, రిగ్గింగ్ సాధ్యం కాదన్నారు.సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో నిలబడిన వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇస్తున్నామన్నారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల నోటిఫికేషన్:జనవరి 10
నామినేషన్ల దాఖలుకు చివరి తేది:జనవరి 17
నామినేషన్ల స్కృూట్నీ: జనవరి 18
నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 20
దిల్లీలో మొత్తం ఓటర్లు
దిల్లీలో మొత్తం ఓటర్లు: 1.55 కోట్లు
పురుష ఓటర్లు: 83.49 లక్షలు
మహిళా ఓటర్లు:71.74 లక్షలు
కొత్త ఓటర్లు:2.08 లక్షలు
20-29 ఏళ్ల మధ్య ఓటర్లు:25.89 లక్షలు
దిల్లీలో పోలింగ్ స్టేషన్లు:13,033
ఎస్ సీ అసెంబ్లీ సెగ్మెంట్లు:12
దిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఆప్ ఒంటరిగా పోటీలోకి దిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీకి దిగుతున్నాయి. ఈసారి హస్తిన పీఠం దక్కించుకోవాలని కమలం పార్టీ అన్ని అస్త్రాలను సిద్దం చేస్తోంది. 2015, 2020 ఎన్నికల్లో దిల్లీలో బీజేపీకి నామమాత్రంగానే సీట్లు వచ్చాయి.
దీంతో ఈసారి ఈ ఎన్నికలను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. గత వారంలో మోదీ దిల్లీలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆప్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని గెలిపిస్తేనే దిల్లీ వాసుల కష్టాలు తీరుతాయని ఆయన విమర్శించారు. బీజేపీపై ఆప్ కూడా ఎదురు దాడికి దిగింది. బీజేపీలో సీఎం అభ్యర్ధి ఎవరని ఆప్ ప్రశ్నించింది. పదేళ్లుగా ఏం చేశామో.. రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామో ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.