HMPV Cases in India: భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్ కలకలం.. ఒకే రోజు మూడు కేసులు..
HMPV virus in India: హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు భారత్ లో మూడు నమోదయ్యాయి.
HMPV virus in India: హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు భారత్ లో మూడు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు, గుజరాత్ లో మరో కేసు నమోదైందని ఐసీఎంఆర్ (ICMR) తెలిపింది. బెంగుళూరులో మూడు, 8 నెలల వయస్సుకన్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకింది. అహ్మదాబాద్ లో కూడా ఈ వైరస్ లక్షణాలతో చిన్నారులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ అధికారులు ప్రకటించారు.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కరోనా వైరస్ లక్షణాల మాదిరిగానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, ఇతర శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ల మాదిరిగానే దీని లక్షణలున్నాయని వైద్యులు ప్రకటించారు. జ్వరం, ముక్కు కారడం, దగ్గు వంటి సమస్యలతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీయవచ్చు.
బెంగుళూరులో రెండు హెచ్ఎంపీవీ కేసులపై సిద్దరామయ్య ఏమన్నారంటే?
బెంగుళూరులో ఇద్దరికి హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావుతో మాట్లాడినట్టు ఆయన మీడియాకు చెప్పారు. ఆరోగ్యశాఖాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారన్నారు.
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని ఎలా నివారించవచ్చు?
సబ్బుతో 20 సెకన్లు చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వైరస్ కు సంబంధించి సరైన వ్యాక్సిన్ లేదు. మాస్కులు వాడడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ వైరస్ లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతులు శుభ్రం చేసుకోకుండా తాగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ సోకినవారిని ఐసోలేషన్ లో ఉంచాలి.