Chhattisgarh Naxal Attack: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు భద్రతా బలగాల వాహనాన్ని పేల్చేశారు. ఈ దాడిలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంతమంది జవాన్లు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బీజాపూర్ జిల్లాలోని కుట్రు రోడ్డుపై ఈ ఘటన జరిగింది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలపై ఈ దాడి జరిగింది.
దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది అని బస్తర్ ఐజి తెలిపారు.
దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది అని బస్తర్ ఐజి తెలిపారు. శనివారమే అంబుజ్‌మద్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
నిన్న ఆదివారం కూడా భద్రత బలగాలు ఒక చోట మందు పాతరను గుర్తించాయి. కూంబింగ్‌లో పాల్గొనే భద్రత బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఆ మందుపాతరను నిర్విర్యం చేశారు. ఆదివారం మందు పాతరను గుర్తించి నిర్విర్యం చేసిన భద్రత బలగాలు సోమవారం మాత్రం ఐఈడి పేలుడు దాటి నుండి తప్పించుకోలేకపోయారు.