Earthquake: నేపాల్‌తో పాటు భారత్‌లో భూకంపం
Earthquake: మంగళవారం ఉదయం నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైంది.
Earthquake: మంగళవారం ఉదయం నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచేకు 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దిల్లీ, బిహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. భూకంపం భూకంప కేంద్రం గోకర్ణేశ్వర్‌కు సమీపంలో ఉందని అంటున్నారు. దీని తీవ్రత 6 నుంచి 7 ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు.