HMPV Cases in India: ఇండియాలోకి ఎంటరైన వైరస్... మళ్ళీ లాక్‌డౌన్ తప్పదా?

HMPV cases in India and Symptoms of HMPV Virus: అసలు హెచ్ఎంపీవీ అంటే ఏంటి? ఇది సోకితే ఏమవుతుంది? కొత్త వైరస్ ను చూసి భయపడుతోంది? ఇండియా కూడా అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చిందా? కరోనావైరస్‌తో పోలిస్తే ఈ వైరస్ ఎంతవరకు డేంజర్ లాంటి ప్రశ్నలకు సమాధానమే నేటి ట్రెండింగ్ స్టోరీ.

Update: 2025-01-07 03:30 GMT

HMPV cases in India and Symptoms of HMPV Virus: ఇప్పటివరకు చైనాకే పరిమితమైన హెచ్ఎంపీవీ కేసులు ఇప్పుడు హాంగ్‌కాంగ్, ఇండియాకు కూడా వ్యాపించాయి. బెంగుళూరులో 3 నెలల వయస్సున్న పసికందుతో పాటు 8 నెలల శిశువుకు కూడా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఈ వైరస్ ఇండియాలోకి కూడా ఎంటరైంది. తరువాత అహ్మెదాబాద్, ఆ తరువాత కోల్‌కతా... ఇలా దేశం నలుమూలలా ఈ వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇంతకీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? ఈ వైరస్ ఎలా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది? ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఏంటి? ఎందుకు ప్రపంచం అంతా ఈ కొత్త వైరస్ ను చూసి భయపడుతోంది? ఇండియా కూడా అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చిందా? కరోనావైరస్‌తో పోలిస్తే ఈ వైరస్ ఎంతవరకు డేంజర్ లాంటి ప్రశ్నలకు సమాధానమే నేటి ట్రెండింగ్ స్టోరీ.

Full View

అసలు హెచ్ఎంపీవీ అంటే ఏంటి? ఇది సోకితే ఏమవుతుంది? what is the impact of the virus?

హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని అర్థం. ఈ వైరస్ సోకితే అచ్చం కరోనావైరస్ తరహాలోనే జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న చిన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై కూడా హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కానీ లేదా వైరస్‌ను అడ్డుకునే చికిత్స కానీ లేకపోవడమే ప్రస్తుతానికి అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

చైనాలో పరిస్థితి ఏంటి? - Situation in China?

చైనాలో కేసులు పెరిగిపోతున్న తీరు, ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గతంలో కరోనావైరస్ చైనా నుండి ప్రపంచ దేశాలకు వ్యాపించినప్పుడు కూడా అక్కడ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి దృశ్యాలే కనిపిస్తుండటం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కరోనావైరస్ లక్షణాల తరహాలోనే శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి జలుబు, దగ్గు వరకు ఈ వైరస్ లక్షణాలు కూడా కరోనావైరస్‌ను గుర్తుచేస్తున్నాయి. ఈ వైరస్‌కు కూడా వ్యాక్సిన్ లేదు. ఒకవేళ కరోనా తరహాలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ప్రాణాలమీదికొస్తే అప్పుడు పరిస్థితి ఏంటా అనేదే యావత్ ప్రపంచాన్ని హై అలర్ట్ చేస్తోంది.

కొవిడ్-19తో పోలిస్తే ఈ కొత్త వైరస్ ఎంతవరకు ప్రమాదకరం? - How danger it is when compared to Corona?

కొవిడ్-19... యావత్ ప్రపంచం ఉన్నట్లుండి మందు లేని ఒక రోగం బారినపడితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన వ్యాధి అది. ప్రపంచదేశాలన్నీ మెడికల్ ఎమర్జెన్సీ బారినపడ్డాయి. మొదట ఆక్సీజన్ కోసం, తరువాత వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడని మనిషి లేరు. కరోనా ఎంతోమందిని బలిగొంది. అయినవారిని చూస్తుండగానే కళ్ల ముందే తీసుకెళ్లిపోయింది. ఎవరిని ఎవ్వరూ ముట్టుకోలేని పరిస్థితి అది. ఇప్పుడు కొత్తగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కూడా అంతే. ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వైరస్ కావడంతో మళ్లీ పాత రోజులే వస్తాయా అనే భయం చాలామందిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆనాటి లాక్‌డౌన్లు, ఆకలి చావులు కళ్ల ముందు కదలాడుతున్నాయని జనం గుర్తుచేసుకుంటున్నారు

వాస్తవానికి హెచ్ఎంపీవీ వైరస్ ను గర్తించడం ఇదేం మొదటిసారి కాదు. 2001 లోనే తొలిసారిగా నెదర్లాండ్స్ లో చిన్న పిల్లలకు ఈ వైరస్ సోకినట్లు కనుగొన్నారు. మలేషియాలో 2023 లోనే 225 కేసులు నమోదయ్యాయి. గతేడాది మలేషియాలో 45 శాతం పెరిగి 327 కేసులకు చేరాయి. కానీ తాజాగా చైనాలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటమే ప్రస్తుత ఆందోళనకు కారణమైంది.

అప్రమత్తమైన భారత్ - India about HMPV cases: 

చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు పెరుగుతున్నప్పటి నుండే భారత్ అప్రమత్తమైంది. తాజాగా భారత్ లోనూ ఈ వైరస్ కేసులు నమోదవుతుండటంతో భారత వైద్య పరిశోధన మండలి ఈ విషయాన్ని మరింత సీరియస్ గా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత్ అన్నివిధాల సిద్ధంగా ఉందని ఇండియన్ మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్ చెప్పింది.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వైరస్ వ్యాపించడం మొదలైతే దాని ప్రభావం అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ ఇబ్బంది ఏ స్థాయిలో ఉంటుందో కొవిడ్ సమయంలోనే దేశమంతా చూసింది. అందుకే ఢిల్లీ సర్కార్ కూడా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. అన్ని ఆస్పత్రులు సరిపడ ఆక్సీజన్ నిల్వలు ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.

స్పందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు - HMPV cases in Telangana and AP:

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా ఈ కొత్త వైరస్‌పై ఎప్పటికప్పుడు ఓ కన్నేసిపెట్టాయి. కేంద్ర ప్రభుత్వంతో ఆరోగ్య శాఖ సమన్వయం చేసుకుంటున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా బి రవిందర్ నాయక్ తెలిపారు. ఏపీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా పద్మావతి కూడా ఇదే మాటన్నారు.

వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవడం ఎలా? - How to prevent HMPV

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  1. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును హ్యాండ్‌కర్చిఫ్ లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకోండి.
  2. మీ చేతులను సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
  3. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకండి.
  4. జలుబు లాంటి ఫ్లూ సమస్యలతో బాధపడే వారి నుండి డిస్టన్స్ మెయింటెన్ చేయాలి.
  5. నీరు సమృద్ధిగా తాగండి. మంచి పౌష్టికాహారం తినండి.
  6. బయటి గాలి వచ్చేలా చక్కటి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
  7. ఒంట్లో సుస్తిగా ఉన్నట్లయితే బయట తిరగడం మానేయాలి.
  8. కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.

చేయకూడని పనులు:

  1. షేక్ హ్యాండ్ చేసుకోవడం మానేయాలి.
  2. వాడిన టిష్యూ పేపర్స్, కర్చిఫ్స్ రెండోసారి వాడకూడదు.
  3. ఫ్లూతో బాధపడుతున్న వారికి కొంత డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి.
  4. తరచుగా నోరు, ముక్కు, కళ్లలో తాకకూడదు.
  5. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు.
  6. డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా మందులు వాడొద్దు.

మళ్లీ లాక్‌డౌన్ వస్తుందా? Will Indian govt again impose lockdown in India? 

ఇండియాలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తోంటే చాలామందికి కలుగుతున్న సందేహం ఇది. ఇదే విషయమై అప్పుడే మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇండియాలో లాక్‌డౌన్ వస్తుందా అనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడైతే సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని చావు అంచుల వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.

అయితే, 2001 నాటి లాన్సెట్ గ్లోబల్ హెల్త్ డేటా ప్రకారం ఈ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1 శాతమే ఉంది. ఇకపై కూడా ఈ వైరస్ కారణంగా మరణాల సంఖ్య ఆ ఒక్క శాతానికే పరిమితమైతే ప్రపంచానికి ఈ వైరస్ పెద్ద సవాలుగా కనిపించకపోచ్చు.

అయితే, ఇక్కడ ఒక సమస్య ఉంది. 2001 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కరోనావైరస్ వ్యాప్తి తరువాత ప్రపంచ జనాభా ఆరోగ్య పరిస్థితుల్లో పెనుమార్పులు జరిగాయి. కరోనా కొంతమందిని మరీ వీక్ చేసింది ఇంకొంతమంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకున్నారు. వ్యాధినిరోధక శక్తి లేని వారిపై ఈ వైరస్ ఈజీగా ఎటాక్ చేస్తుందని నిపుణులే చెబుతున్నారు. అందుకే ఇకపై హెచ్ఎంపీవీ కేసులు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News