బస్సులో ప్రయాణించిన స్టాలిన్.. బంపర్ ఆఫర్.. బస్సుల్లో వారికి ఉచితంగా ప్రయాణం...

MK Stalin: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి...

Update: 2022-05-07 07:15 GMT
Tamil Nadu CM MK Stalin Travelled in Bus to Marina Beach and Offered Free for Below 5 Years Children

బస్సులో ప్రయాణించిన స్టాలిన్.. బంపర్ ఆఫర్.. బస్సుల్లో వారికి ఉచితంగా ప్రయాణం...

  • whatsapp icon

MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రతి అంశంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటారు. తాజాగా బస్సులో ప్రయాణించారు స్టాలిన్. తమిళనాడులో DMK ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మాజీ సీఎం CN అన్నాదురైలకు స్టాలిన్ నివాళులర్పించారు. మెరీనా బీచ్‌కు చేరుకునేందుకు సాధారణ ప్రయాణికుడిలా ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు.

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పాలన, బస్సు సౌకర్యాలు వంటి అంశాలను ప్రయాణికులు, కండక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తమిళనాడు సర్కార్ ఐదేళ్లలోపు చిన్నారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు నడిపే అన్ని రకాల బస్సుల్లో వారికి ఉచితంగా ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News