Top 6 News @ 6PM: మీకేం నొప్పి... ఏసీబీ విచారణ అనంతరం పోలీసులపై కేటీఆర్ ఫైర్

Update: 2025-01-09 12:46 GMT

1) KTR press meet after ACB investigation: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏడు గంటలపాటు సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగింది. ఈ విచారణలో ముగ్గురు అధికారులు పాల్గొన్నారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ విచారణలో అధికారులకు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అన్నారు. విచారణ జరిగిన తీరు గురించి మీడియాకు వివరిస్తూ... మరొకసారి ఈ కేసును "చెత్త కేసు" అని కేటీఆర్ అన్నారు. ఏసీబీ అధికారులు మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. కానీ విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సహకరిస్తానని చెప్పారు.

రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే నలభై రకాలుగా అడిగారు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వాళ్లను తాను కూడా ఒక ప్రశ్న అడిగానన్నారు. డబ్బులు పంపించినట్లు చెబుతున్నాం. డబ్బులు వచ్చినట్లుగా వారు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడుందని తాను ఏసీబీ అధికారులను ప్రశ్నించానని అన్నారు.

అయితే, కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ బయట మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు వచ్చి ఇక్కడ మీడియా పాయింట్ లేనందున ఇక్కడ ప్రెస్ మీట్స్ పెట్టకూడదన్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నందున మీ పార్టీ ఆఫీసుకు వెళ్లి ప్రెస్ మీట్స్ పెట్టుకోండని సూచించారు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ "ఇక్కడ మీడియాతో మాట్లాడితే ఏం నొస్తుంది మీకు" అని అన్నారు. "మీడియాతో మాట్లాడితే ఎందుకు అంత భయపడుతున్నారు" అని పోలీసులను ప్రశ్నించారు. అందుకు పోలీసులు స్పందిస్తూ... మా డ్యూటీ మేం చేస్తున్నామని బదులిచ్చారు. 

2) Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారు. సీఎం చంద్రబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలను మంత్రులు, అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. సరిగా ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నెరవేర్చాలి తమాషాలు చేయొద్దన్నారు.

రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియాదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు.. అని నిలదీశారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో 2 వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎలా పెట్టారంటూ అధికారులను ప్రశ్నించారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఫైరయ్యారు. ఎప్పుడూ చేసినట్టే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పగా.. ఎవరో చేశారని.. మీరు కూడా అలానే చేస్తారా? మీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ సీరియస్ అయ్యారు.

3) Bhu Bharati Act: భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం.. ఇకపై నో ధరణి

Bhu Bharati to replace Dharani portal: తెలంగాణ ప్రభుత్వం దరణి పోర్టల్ స్థానంలో తీసుకొస్తున్న భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో భూభారతి ఇప్పుడు అధికారికంగా చట్టరూపం దాల్చింది. గవర్నర్ ఆమోదం తరువాత రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ భూభారతి చట్టం కాపీని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందించారు.

తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దరణి చట్టం వల్ల ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు అనుగుణంగా ఉండేలా ధరణి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

4) KTR: కేటీఆర్ లాగా ఎవరైనా ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్లొచ్చా?

KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్ కు న్యాయవాదితో పాటు హాజరయ్యేందుకు తెలంగాణహైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కేటీఆర్ కే కాదు సాధారణ పౌరులు కూడా ఏ కేసులోనైనా విచారణకు హాజరయ్యేందుకు అడ్వకేట్ సహాయం తీసుకోవచ్చు. అయితే ఇందుకు కోర్టు అనుమతి ఉండాలి. ఏదైనా కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు లేదా ఏసీబీ అధికారులు లేదా సీబీఐ నోటీసులు జారీ చేస్తే ఈ నోటీసుల ఆధారంగా విచారణకు న్యాయవాదితో కలిసి హాజరయ్యేందుకు నోటీసులు అందుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించాలి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) Anechoic Chamber: ఈ గదిలో ఉంటే మీలో రక్తం ప్రవహిస్తున్న చప్పుడు కూడా స్పష్టంగా వినిపిస్తుంది

Anechoic Chamber: అసలు ఏ మాత్రం చప్పుడు లేని ప్రదేశంలో మీరు ఉన్నట్లు ఊహించుకోండి. అది ఎంత నిశ్శబ్దమైన ప్రదేశం అంటే, అక్కడ ఉంటే మీ గుండె చప్పుడు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఊపిరితిత్తులు సంకోచిస్తూ, వ్యాకోచిస్తున్న శబ్దం కూడా వినిపిస్తుంది. ఇంకా, చెప్పాలంటే మీ శరీరంలో రక్తం ప్రసరిస్తున్న చప్పుడు కూడా వినిపించేంత సైలెంట్ ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి ప్రదేశం ఒకటి ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా?

రండి... ఈ భూమి మీద అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశానికి మీకు స్వాగతం. ఇక్కడ చాలా మంది అరగంట కూడా ఉండలేకపోయారు. ఈ గదిలోకి అడుగుపెడితే నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా అని అనిపిస్తుంది. ఈ గది గోడలన్నీ మెత్తని ఫోమ్ వంటి పలకలతో కవర్ చేశారు. లైటింగ్ డిమ్ గా ఉంటుంది. లోపల కూర్చోవడానికి కుర్చీల్లాంటివి కూడా ఏమీ ఉండవు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. 417 రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న ఖతర్నాక్ ప్లేయర్?

India's Champions Trophy Squad: ప్రస్తుతం అందరి దృష్టి ఛాంపియన్స్‌ ట్రోఫీపై పడింది. టోర్మమెంట్‌ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీకి సంబంధించిన టీమిండియా జట్టు ప్రకటనకు జనవరి 12వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దీంతో టీమిండియా జట్టుకు సంబంధించి అందరి దృష్టి పడింది. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత అందరి దృష్టి భారత జట్టుపై పడింది.

రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , జస్ప్రీత్ బుమ్రా వంటి క్రీడాకారులకు సంబంధించి ఆసక్తినెలకొంది. తాజా సమాచారం ప్రకారం షమీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహ్మద్‌ షమీ చివరిసారిగా 2023 నవంబర్‌ 19వ తేదీన అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. షమీ మ్యాచ్‌ ఆడక సుమారు 417 రోజులు అవుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన తర్వాత షమీ ఆటకు దూరంగా ఉన్నాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News