Coronavirus: సుప్రీంకోర్టులో కరోనా కలవరం
Coronavirus: సిబ్బందిలో సగం మందికి సోకిన కరోనా * కోవిడ్ ఎఫెక్ట్‌తో ఆన్‌లైన్‌లో విచారణలు
Coronavirus: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. సగం మందికిపైగా సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. శనివారం ఒక్కరోజే 44 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో సుప్రీంకోర్టులో విచారణలు వర్చువల్‌గా జరగనున్నాయి. సిబ్బంది, లాక్లర్కులకు కరోనా సోకడంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరపాలని నిర్ణయించారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో కోర్టు బెంచ్‌లు ఇవాళ ఓ గంట ఆలస్యంగా ప్రారంభమవుతాయని నోటీసులిచ్చింది కోర్టు.
ఇక కరోనా కేసుల నేపథ్యంలో కోర్టు హాళ్లు, పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ పలు బెంచ్‌లు షెడ్యూల్ సమయం కంటే గంట ఆలస్యంగా మొదలవనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే బెంచీలు ఉదయం 11.30 గంటలకు, 11 గంటలకు మొదలయ్యే బెంచీలు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ప్రారంభించనున్నాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రీ ముందు అత్యవసర కేసుల ప్రస్తావన కూడా ఆన్‌లైన్‌లో చేయాలని వెల్లడించారు.