ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

Delhi: రూ. 1200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Update: 2022-09-07 03:45 GMT
Police Busted a Drug Racket in Delhi

ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

  • whatsapp icon

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 12వందల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గతంలో తమిళనాడు రాజధాని చెన్నై నుంచి యూపీలోని లక్నోకు, అక్కడి నుంచి ఢిల్లీకి డ్రగ్స్‌ను తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌, రాజస్థాన్‌లకు ఈ డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. స్మగ్లర్ల నుంచి 312.5 కిలోల మెథాంఫెటమైన్, 10 కిలోల హెరాయిన్‌ను ఢీల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Full View


Tags:    

Similar News