PM-KISAN: రైతుల ఖాతాల్లోకి పీఏం కిసాన్ నగదు..
PM-KISAN: నిరీక్షణకు తెరపడింది. మోదీ సర్కార్ రైతులకు తీపికబురు అందించింది.
PM-KISAN: నిరీక్షణకు తెరపడింది. మోదీ సర్కార్ రైతులకు తీపికబురు అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ఎనిమిదో విడత ఆర్థిక సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ విడతలో 19వేల కోట్లను 9.5కోట్ల మంది ఖాతాల్లో జమ చేయనున్నారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 2019లో కేంద్రం పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి 6వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకోసారి 2వేల చొప్పున మూడు వాయిదాల్లో అందిస్తున్నారు. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది. కిసాన్ సమ్మాన్ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లను అన్నదాతలకు అందించింది.