Cyclone Yaas: నేడు బెంగాల్, ఒడిశాల్లో ప్రధాని పర్యటన

Cyclone Yaas: యాస్ తుపాన్ ప్రభావి ప్రాంతాలైన బెంగాల్, ఒడిశాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

Update: 2021-05-28 02:09 GMT

PM Modi:(File Image) 

Cyclone Yaas: యాస్ తుపాను ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. తుపాన్ వల్ల జరిగిన నష్టం, చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకోనున్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి, నష్టాన్ని అంచనా వేయనున్నట్లు సమాచారం. గురువారం ఆయన ఢిల్లీలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీలయినంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర సంస్థలను ఆదేశించారు.

యాస్ తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ అతలాకుతలం అయ్యాయి. రెండు రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి కోటి మందికి పైగా నష్టపోయారు. అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గంటకు 150 కిలోమీటర్లతో వీచిన పెనుగాలులు ఒడిశాలోని భద్రక్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. ప్రచండ గాలుల ధాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌ తీరంలో సముద్రం బాగా ముందుకొచ్చింది.

వందల గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి. తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒడిశా, బెంగాల్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒడిశాలో యాస్ తుపాన్ వల్ల 130కి పైగా గ్రామాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో తుపాన్ నష్టాల పై నేరుగా కలసి చర్చించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News