Narendra Modi: నేడు బంగ్లాదేశ్ కు ప్రధాని మోదీ..

Narendra Modi: ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

Update: 2021-03-26 02:36 GMT

PM మోడీ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లడం తొలిసారి. బంగ్లాదేశ్‌కు 1971, డిసెంబరు 6న స్వాతంత్ర్యం వచ్చింది. అంటే స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు అవుతోంది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి, స్వతంత్ర దేశంగా అవతరించడంలో భారత్ కీలక పాత్రపోషించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొనాలని ప్రధాని మోదీని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు బంగ్లాలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

శుక్రవారం ఉదయం 7.45 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. ఉదయం 10 గంటలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, నివాళులర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ సమావేశమవుతారు. ఆ తర్వాత 3:45 గంటలకు జాతీయ దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. రాత్రి 7:45 గంటలకు బాపు – బంగబందు డిజిటల్ వీడియో ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మరో వైపు దేశంలో కేంద్రంతీసుకొచ్చి సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. దీనిని ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనపడటం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.

Tags:    

Similar News