Coronavirus: కోటి కేసులు..90 వేల మరణాలు!

Coronavirus: ఒక్క నెలలో కరోనా తీవ్రత ఇదీ * తొలిదశతో పోల్చితే పదిరెట్ల వేగం

Update: 2021-05-15 11:24 GMT

Representational Image

Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ బీభత్సం ఊహకందని స్థాయిలో కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక సరిగ్గా నెలంటే నెలరోజుల్లో దేశవ్యాప్తంగా కోటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే మహమ్మారి తీవ్ర ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదు, కేవలం 30రోజుల్లోనే 90వేలకు పైగా మరణాలు సంభవించాయంటే ఏ రేంజులో కరోనా కాటేస్తుందో తెలుసుకుంటే వణుకు పుట్టడం ఖాయం. మొదటి వేవ్‌లో కోటి కేసులు, 90వేలు మరణాలు జరగానికి దాదాపు ఏడాది టైమ్ పడితే సెకండ్ వేవ్‌లో మాత్రం కేవలం నెలరోజుల్లోనే జరగడం ప్రస్తుత భయానక పరిస్తితికి అద్దం పడుతోంది.

Tags:    

Similar News