Coronavirus: దేశ వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చుతున్న కరోనా
Coronavirus: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో కేసులు నమోదు * మహారాష్ట్రలో అధిక కేసులు నమోదు
Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కోవిడ్ మరోసారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు 16వేలు దాటింది. ఆదివారం కొత్తగా 16వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి.. వారిలో 50 మరణాలు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది.
భారీగా కేసులు వస్తుండడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే మార్చి 31 వరకు పూణేలోని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పుణేలో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ప్యూ అమలులో ఉంటుందని అత్యవసరం అయితే తప్ప ప్రజలెవ్వరు కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలను 50 శాతం మేర సీటింగ్ సామర్థ్యంతో నడిపించాలని రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు. అంత్యక్రియలు, ఇతర మీటింగ్‌లకు 50 మందికే అనుమతి ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.