సిద్ధమైన మోడీ మంత్రి వర్గం.. 30 మందితో సెంట్రల్ కేబినెట్

పాత మంత్రి వర్గంలోని 9మంది కొనసాగింపు

Update: 2024-06-09 08:35 GMT

సిద్ధమైన మోడీ మంత్రి వర్గం.. 30 మందితో సెంట్రల్ కేబినెట్  

మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. మోడీతో పాటే.. 30 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఏపీ నుంచి అత్యధికంగా ముగ్గురు ఎంపీలకు మోడీ కేబినెట్‌లో స్థానం దక్కింది. ఇద్దరికి కేబినెట్ కాగా.. ఒకరికి సహాయక మంత్రిగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున మోడీ కేబినెట్‌ బర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు. ఇక యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, హర్యాణా, లాంటి రాష్ట్రాలనుంచి ఒక్కొక్కిరికి అవకాశం దక్కింది. ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, కాగా... తెలంగాణ నుంచి బండి సంజయ్ , కిషన్ రెడ్డిలకు అవకాశం దక్కింది. అయితే.. గత మంత్రివర్గంలోని 9మందికి స్థానం అలాగే కొనసాగిస్తున్నారు. వారిలో ముఖ్యంగా.. రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజుజు, అశ్విణీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మాండవీయాలకు మంత్రివర్గంలో ఉన్నారు.

అయితే.. ఈసారి కొత్తగా దాదాపు 13 మందిని మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, ఇంద్రజిత్ సింగ్, జెడియు... లలన్ సింగ్, సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్ హిందూస్తాన్ ఆవం మోర్చా (HAM ).. జితిన్ రామ్ మాంజీ, RLD నుంచి జయంత్ చౌదిరి, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవర్, ప్రపుల్ పాటిల్, అప్నాదళ్‌ నుంచి అనుప్రియా పాటిల్, RPI నుంచి రామ్‌దాస్ అత్వాలే.. లాంటి వారికి ఈసారి కొత్తగా మంత్రి వర్గంలో స్థానం దక్కింది.

Tags:    

Similar News