Sukhbir Singh Badal: గోల్డెన్ టెంపుల్ దగ్గర కాల్పులు.. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిపై హత్యాయత్నం
Golden Temple: పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర కాల్పులు కలకలం రేపాయి. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది.
Golden Temple: పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర కాల్పులు కలకలం రేపాయి. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. దుండగుడు తుపాకీతో సమీపానికి వెళ్లి ఒక్క రౌండ్ కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన బాదల్ అనుచరులు నిందితుడిని పట్టుకున్నారు. దీంతో తుపాకీ గాల్లో పేలింది.
అయితే సిక్కు మత పెద్దలు వేసిన శిక్షలో భాగంగా సుఖ్‌బీర్ సింగ్ స్వర్ణదేవాలయం దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా తన ప్యాంట్ పాకెట్ నుంచి గన్ తీసి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన శిరోమణి నేతలు ఆ షూటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా కాల్పులు జరిపిన వ్యక్తిని నారాయణ్ చౌరాగా గుర్తించారు.