పసుపులో విషపూరితమైన సీసం... మనం తింటున్న పసుపు మంచిదేనా?

Lead Contamination in Turmeric: భారత్‌లో వంటలు, శుభకార్యాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తుంటారు.

Update: 2024-11-13 16:41 GMT

Lead Contamination in Turmeric: భారత్‌లో వంటలు, శుభకార్యాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తుంటారు. అంతేకాదు పింపుల్స్, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలతో బాధపడేవారు పసుపుతో చేసిన పలు రకాల ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తుంటారు. కొందరు జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉండడానికి పసుపు పాలు తాగుతుంటారు. అయితే పసుపులో విషపూరితమైన సీసం ఉన్నట్టు ఓ అధ్యయనం పేర్కొంది.

భారతదేశం, నేపాల్, పాకిస్తాన్‌లో అమ్ముతున్న పసుపులో సీసం అధిక స్థాయిల్లో ఉన్నట్టు గుర్తించింది. భారత ఆహార నాణ్యతా, ప్రమాణాల సంస్థ నిర్దేశించిన గరిష్ట పరిమితి ప్రకారం గ్రాము పసుపులో లెడ్ మోతాదు 10 మైక్రో గ్రాములు మించకూడదు. కానీ ఈ అధ్యయనంలో పరిశీలించిన పసుపు శాంపిళ్లలో లెడ్ మోతాదు వెయ్యి మైక్రో గ్రాముల కంటే అధికంగా ఉన్నట్టు తేలింది.

భారత్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలోని 23 నగరాల నుంచి సేకరించిన పసుపు శాంపిళ్లను ఈ అధ్యయనంలో పరిశీలించారు. పాట్నా, గువాహటి, చెన్నై, కాఠ్మాండూ, కరాచీ, ఇస్టామాబాద్, షెషావర్ నగరాల నుంచి సేకరించిన నమూనాల్లో పది మైక్రోగ్రాముల కంటే అధికంగా లెడ్ ఉన్నట్టు తేలింది. ఫ్రీడమ్ ఎంప్లాయబిలిటీ అకాడమీ, ప్యూర్ ఎర్త్‌తో కలిసి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురితమయ్యాయి.

ప్యాక్ చేయబడిన బ్రాండెడ్ పసుపు ఉత్పత్తులు తక్కువ సీసం సాంద్రతలను కలిగి ఉంటాయి. పసుపు వదులుగా తక్కువ-నియంత్రిత రూపాలు కలుషితానికి ఎక్కువ అవకాశం ఉందని సూచిస్తున్నాయి. పసుపులో సీసం కలుషితం చేయడం చట్టవిరుద్ధంకానప్పటికీ.. ఎక్కువ మోతాదుల్లో కలపడం వల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు. తెలివితేటలు, ప్రవర్తనా సమస్యలు, పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలలో ఆలస్యం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News