Birju Maharaj: కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూత
Birju Maharaj: ఢిల్లీ సాకేత్ ఆస్పత్రిలో గుండె పోటుతో తుదిశ్వాస విడిచిన మహరాజ్
Birju Maharaj: ప్రముఖ కథక్ నృత్య కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూశారు. ఢిల్లీలోని సాకేత్ ఆస్పత్రిలో అనారోగ్యానికి చికిత్స పొందుతూ మరణించారు. 83 ఏళ్ల ఒరిస్సా కళాకారుడైన బిర్జు మహరాజ్ కథక్ స్టైల్ నృత్యానికి ఊపిరులూది, ప్రాణం పోసిన వ్యక్తి 1938లో కథక్ నృత్య కళాకారుడు ఈశ్వరీ ప్రసాద్ దంపతులకు పుట్టిన బిర్జూ ఏడేళ్ల వయసులోనే దేశ వ్యాప్తంగా పర్యటించి ఎన్నో చోట్ల నృత్య ప్రదర్శనలిచ్చారు.
యుక్త వయసులో అమెరికా, రష్యా, జపాన్, యూకె, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా దేశాలలో పర్యటించి ప్రదర్శనలిచ్చారు. సత్రంజ్ కి ఖిలాడీ, దిల్ తో పాగల్ హై, దేవదాస్ , గదర్ లాంటి సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ కూడా చేశారు. బిర్జు మహరాజ్ కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.