Srikalahasti: శ్రీకాళహస్తికి ఇస్రో శాస్త్రవేత్తలు.. PSLV C- 57 రాకెట్ ప్రయోగం కోసం పూజలు
Srikalahasti: ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసిన అధికారులు
Srikalahasti: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానానికి ఇస్రో శాస్త్రవేత్తలు విచ్చేశారు. వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆదిత్య ఎల్-1తో పాటు PSLV C- 57 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దర్శన అనంతరం దక్షిణామూర్తి ఆలయం వద్ద వేదపండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.