ADITYA-L1: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం
ADITYA-L1: 127 రోజుల పాటు 15లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1
ADITYA-L1: ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించింది. ఆదిత్య ఎల్-1ను విజయవంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లోకి చేరిన ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఆదిత్య ఎల్ వన్ ద్వారా ఇస్రో సూర్యుడి కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై అధ్యయనం చేయనుంది.
గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. అప్పటినుంచి వివిధ దశల ద్వారా లాగ్రాంజ్ పాయింట్‌కు ఆదిత్యను పంపారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఇస్రో నిర్వహించిన 4 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం 127 రోజుల పాటు 15లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది ఆదిత్య ఎల్-1. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్-1 సేవలు అందించనుంది. ఇక ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ అవడంతో.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ.