Hydrogen Train: తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

India's first Hydrogen train: హైడ్రోజన్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. 2030 నాటికి భారత్‌లో కార్భన్ ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-18 14:00 GMT

Hydrogen Train

India's first Hydrogen train trail run: హైడ్రోజన్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. 2030 నాటికి భారత్‌లో కార్భన్ ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ రైళ్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ట్రయల్ రన్ విజయవంతమైతే 2025లో ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. జింద్- సోనిపట్ మార్గంలో తొలిసారిగా ఈ రైలును ప్రవేశ పెడతారు. ఈ రైలు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పర్యాటక ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

2030 నాటికి భారతీయ రైల్వేలు నెట్ జీరో కార్బన్ ఎమిటర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో 35 హైడ్రోజన్ రైళ్ల కోసం రూ.2800 కోట్లు కేటాయించారు. హెరిటేజ్ మార్గాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.600 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అదే విధంగా డీజిల్ ఆధారిత డెమొ రైళ్లను హైడ్రోజన్‌తో నడపడానికి కూడా ఒక ప్రాజెక్టు ప్రారంభించింది. దీనికి రూ.111.83 కోట్ల కాంట్రాక్ట్‌ను అప్పగించారు.

రైలులో హైడ్రోజన్‌తో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ మార్గాలలో మొక్కలు నాటడంతో పాటు, రైల్వే స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌లను సైతం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వేకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పర్యావరణానికి మరింత మేలు జరుగనుంది. ఈ ప్రాజెక్టుతో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా తర్వాత హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న ఐదో దేశంగా ప్రపంచంలోనే భారత్ ఘనత దక్కించుకోనుంది. ఫ్రెంచ్ కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్ రైలును సిద్ధం చేసింది. 2018 నుంచి ఫ్రాన్స్‌లో ఈ హైడ్రోజన్ రైలు నడుస్తోంది.


Full View


Tags:    

Similar News