27 నుంచి అంతర్జాతీయ విమానాలకు పర్మిషన్
International Flights: సరిగ్గా రెండేళ్ల తరువాత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు కేంద్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
International Flights: సరిగ్గా రెండేళ్ల తరువాత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు కేంద్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ప్రపంచ పర్యాటకులను అనుమతించనున్నట్టు పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా 2020లో మార్చి 23న అంతర్జాతీయ విమానాల మీద మోడీ సర్కారు నిషేధం విధించింది. అప్పట్నుంచీ కరోనా వివిధ రూపాల్లో వ్యాపిస్తూ విమానయానం, టూరిజం వంటి శాఖలపై తీవ్ర ప్రభావం చూపింది.
అయితే ప్రపంచ స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో పటిష్టమైన చర్యలు తీసుకున్న కారణంగా ఇండియా చెప్పుకోదగినంత చేదు అనుభవాలను చవి చూడలేదు. ఇప్పుడు చాలావరకు నియంత్రణలోనే ఉందని భావిస్తూ ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలకు అనుమతిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.