భారత్ - చైనా ఘర్షణ : 20 మంది భారత జవాన్ల వీరమరణం!

Update: 2020-06-17 01:17 GMT

ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పది మంది మృతదేహాలను గుర్తించగా.. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. మరోవైపు చైనాకు కూడా భారీ నష్టం వాటిల్లింది. చైనా సైనికులు కూడా 43 మంది ప్రాణాలు కొల్పోయినట్లు, లేదా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయలేదు.. బహుశా పరువు పోతుందని ప్రకటన చేయకుండా ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

వాస్తవాధీన వెంట గాల్వన్ లోయలో భారత్- చైనా ఆర్మీల మధ్య రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నట్టు తెలుస్తోంది. చరిత్రలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇలాంటి ఘటనలు చాలాసార్లు చోటు చేసుకున్నా.. 45 ఏళ్లుగా రెండు వైపుల నుంచి ప్రాణ నష్టంలేదు. ఇరుదేశాలు బలగాలను వెనక్కి నెట్టుకుంటున్నాయి. మహా అయితే చిన్నపాటి ఘర్షణలు మాత్రమే చోటు చేసుకునేవి. కానీ, సోమవారం ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగి హింసాత్మకంగా మారింది. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News