హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..

హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ డాక్టర్ రాజీవ్ బిందాల్ తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2020-05-28 08:34 GMT

హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ డాక్టర్ రాజీవ్ బిందాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య శాఖ అధికారి అవినీతి ఆరోపణలపై సరైన దర్యాప్తు జరిపేందుకు తాను ఇలా చేస్తున్నానని చెప్పారు. ఐదు లక్షల రూపాయల విలువైన లంచం కేసులో ఆయన పేరు బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించి 43 సెకన్ల ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అజయ్ కుమార్ గుప్తాను మే 20 న స్టేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో అరెస్టు చేసింది, ఇందులో అజయ్ కుమార్ గుప్తా 5 లక్షల రూపాయల లంచం కోసం వేరే వ్యక్తిని అడుగుతున్నట్టు అర్ధమవుతోంది.

ఇక ఈ కేసులో అరెస్టు చేసిన తరువాత అజయ్ కుమార్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జనవరి 18 న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడైన బిందాల్, ఈ కేసును ఎటువంటి ఒత్తిడి లేకుండా సమగ్రంగా దర్యాప్తు చేయడానికి తాను రాజీనామా చేశానని చెప్పారు. మరోవైపు రాజీనామాను బిజెపి అధ్యక్షుడు అంగీకరించారని పార్టీ తెలిపింది. అవినీతి ఆరోపణలతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని, ఆరోగ్య అధికారిపై కూడా చర్యలు తీసుకుందని బిందాల్ అన్నారు.

Tags:    

Similar News