Indian Railway: రైల్వే ప్రయాణికులకి గుడ్ న్యూస్.. త్వరలో ఏసీ కోచ్‌లలో ప్రయాణం..
Indian Railway: మీరు తరచుగా రైళ్లలో ప్రయాణించే వారైతే మీకు ఇది శుభవార్త అవుతుంది.
Indian Railway: మీరు తరచుగా రైళ్లలో ప్రయాణించే వారైతే మీకు ఇది శుభవార్త అవుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దాని సౌలభ్యం, వేగం కారణంగా అందరికి ఇష్టమైనదిగా మారింది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు భారతీయ రైల్వే స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలపై నడపాలని యోచిస్తోంది. భారతీయ రైల్వేలు ఇచ్చిన సమాచారం ప్రకారం..స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని అన్ని కోచ్‌లు ఎయిర్ కండిషన్ చేస్తారు.
స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మీడియం, సుదూర మార్గాలలో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిని మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న మరఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో లేదా చెన్నైలో జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. 200 స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం భారతీయ రైల్వే టెండర్లు జారీ చేసింది. ఈ టెండర్‌లో ఎక్స్‌ప్రెస్ డిజైన్, తయారీ,నిర్వహణ ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను టెండర్ చివరి తేదీని 26 జూలై 2022గా నిర్ణయించారు.
రైల్వేలు ఇచ్చిన సమాచారంలో మొదటి ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్ 20 మే 2022 న నిర్వహిస్తారు. స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ డెలివరీకి 6 సంవత్సరాల 10 నెలల గడువు ఉంటుందని రైల్వే టెండర్‌లో తెలిపింది. ఈ సమయంలో కంపెనీ 200 రైళ్లను సిద్ధం చేస్తుంది. 16 కోచ్‌లున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. 20 కోచ్‌లతో కూడిన స్లీపర్ రైలులో ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 15 థర్డ్ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ రైలు వేగం గంటకు 160 కి.మీ.గా ఉంటుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రత్యేకమైన ఫీచర్స్, సదుపాయాలు ఉంటాయి. మెట్రో రైళ్లల్లో ఉన్నట్టుగా ఫుల్లీ ఆటోమెటిక్ డోర్లు, ఏసీ కోచ్‌లు ఉంటాయి. 180 డిగ్రీలు తిరిగే రివాల్వింగ్ చైర్లు ఉంటాయి. ఈ రైలులో బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, ఇతర హైటెక్ ఫీచర్స్ ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లల్లో భోజన సదుపాయాలు ఉంటాయి. ప్రయాణికులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ లాంటివి రైలులోనే కొనుక్కోవచ్చు. కోచ్‌లో వైఫై యాక్సెస్ కూడా ఉంటుంది.