కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
Raghuvansh Prasad Passes Away : కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూశారు..ప్రస్తుతం ఆయన వయసు
Raghuvansh Prasad Passes Away : కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూశారు..ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయన జూన్ లో కరోనా పడి కోలుకున్నారు. అయినప్పటికీ మళ్ళీ అనారోగ్యానికి గురికావడంతో అయనని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందించారు. దాదాపుగా 32 సంవత్సరాలు పాటు పార్టీలో కొనసాగిన ఆయన, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు తన రాజీనామా లేఖను పంపారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు అయన పార్టీకి రాజీనామా చేశారు.
ఇక ఈరోజు ఉదయం బీహార్‌లో పెట్రోలియం ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, రఘువంశ్ ప్రసాద్ సింగ్‌కు నివాళి అర్పించి తన ప్రసంగం ప్రారంభించారు. "రఘువంశ్ ప్రసాద్ సింగ్ మన మధ్య లేరు. అతని మరణం బీహార్ రాజకీయ రంగంలో మరియు దేశంలో శూన్యతను మిగిల్చింది" అని ప్రధాని అన్నారు.
Raghuvansh Prasad Singh Ji is no longer among us. I pay my tributes to him: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) September 13, 2020
రఘువంశ్ ప్రసాద్ సింగ్ బీహార్ లోని వైశాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గం నుంచి రికార్డుస్థాయిలో ఐదుసార్లు గెలుపొందారు. కాగా.. ఆయన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ -1 ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా, ఆహార, వినియోగదారుల వ్యవహారాలుగా కూడా పనిచేశారు. ఆయన పదవీకాలంలోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు.. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులూ సంతాపం తెలుపుతున్నారు.