Farmer Sold Cow for Son's Online Classes: పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఆవును అమ్మేశాడు
Farmer Sold Cow for Son's Online Classes: కరోనా కట్టడిలో భాగంగా భాగంగా విద్యార్ధులకి ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించడానికి విద్యాసంస్థలు మొగ్గు చూపుతున్నాయి.
Farmer Sold Cow for Son's Online Classes: కరోనా కట్టడిలో భాగంగా భాగంగా విద్యార్ధులకి ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించడానికి విద్యాసంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ తరుణంలో విద్యార్ధులకి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపొయింది. అయితే తన ఇద్దరు చిన్నారుల ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం ఓ తండ్రి తన కుటుంబానికి జీవనాధారం అయిన ఆవును అమ్మేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్ అనే వ్యక్తికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అందులో ఒకరు నాలుగో తరగతి, మరొకరు రెండో తరగతి చదువుతున్నారు. అయితే ఆన్లైన్ క్లాసులకి హాజరయ్యేందుకు స్మార్ట్ ఫోన్ ఫోన్ లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా స్మార్ట్ ఫోన్ లేకపోతే ప్రస్తుతం పిల్లలు చదువు కొనసాగించాలేవు అని చెప్పడంతో కుల్దీప్‌పై స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో కుల్దీప్ చేసేది ఏమీలేకా తనకి జీవనాధారం అయిన ఆవును అమ్ముకోవాల్సి వచ్చినట్టుగా వెల్లడించాడు. అంతేకాకుండా తనకి కనీసం రేషన్ కార్డు కూడా లేదని కుల్దీప్ పేర్కొన్నాడు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని చూసి చలించి పోయిన నటుడు సోనూ సూద్ సంబంధిత వ్యక్తికి ఆవును తిరిగి ఇచ్చేద్దాం.. వివరాలు కావాలంటూ ట్విటర్ ద్వారా కోరారు. దీంతో సోనూపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇప్పటికే సోనుసూద్ కరోనా సమయంలో ఇబ్బంది పడ్డ వలస కూలీలను తమ నివాసలకి చేర్చిన సంగతి తెలిసిందే.
Ravinder ji. Can you please share his details. https://t.co/dsKG4eCAmw
— sonu sood (@SonuSood) July 23, 2020