Ayodhya: అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన
Ayodhya: నృత్య ప్రదర్శన ఇవ్వనున్న బాలీవుడ్ నటి హేమమాలిని
Ayodhya: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సమయం అసన్నం అవుతోంది. ఈ మహా క్రతువుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఓ చారిత్రక ఘట్టంలా ఉత్సవాన్ని నిర్వహించబోతోన్నారు. ఐతే ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినితో సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. హేమమాలిని స్పెషల్ గా నృత్య ప్రదర్శను ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. రామాయణం ఆధారంగా ఉండే ఈ నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని హేమమాలిని వెల్లడించారు.