Coronavirus: మే నెల 14-18 మధ్య కొవిడ్‌ విశ్వరూపం చూపే అవకాశం

Coronavirus: కరోనా సెకండ్ వేవ్ భారత్‌‌ను హడలెత్తిస్తుంది. మే నెల 14-18 మధ్య వైరస్‌ ఉధృతి పతాక స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

Update: 2021-04-27 07:13 GMT

Coronavirus: మే నెల 14-18 మధ్య కొవిడ్‌ విశ్వరూపం చూపే అవకాశం

Coronavirus: కరోనా సెకండ్ వేవ్ భారత్‌‌ను హడలెత్తిస్తుంది. మే నెల 14-18 మధ్య వైరస్‌ ఉధృతి పతాక స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక ఈ సమయంలో దేశంలో యాక్టివ్ కేసులు 38-48 లక్షల మధ్య ఉండొచ్చని తెలిపారు. మే నెల 4-8 మధ్య రోజువారీ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య అత్యధికంగా 4.4 లక్షలకు చేరుకోవచ్చని హైదరాబాద్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ అంచనాలు వేశారు. మే 11-15 మధ్య ఈ మహమ్మారి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని, ఆ సమయంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33-35 లక్షల మేర ఉండొచ్చని ఆ అంచనాల్లో చెప్పారు. మే నెలాఖరుకు కేసులు గణనీయంగా తగ్గొచ్చని కూడా తెలిపారు.

Tags:    

Similar News