Corona Cases in India: భారత్ లో కొత్తగా 46,766 కేసులు నమోదు

Corona Cases in India: డిచిన 24 గంటల్లో 41,506 కేసులు * ఒక్కరోజులో 895 మంది మృత్యువాత

Update: 2021-07-11 05:46 GMT

Representational image

Corona Cases in India: నిన్నటితో పోల్చితే భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న 42వేల 766 కేసులు నమోదు అయితే.. తాజాగా 41వేయి 5వందల 6కేసులు వెలుగులోకి వచ్చాయి. లాస్ట్‌ 24 గంటల్లో 41వేల 526 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య చూస్తే దేశవ్యాప్తంగా 8వందల 95 మంది మృత్యువాత పడ్డారు.

నిన్నటితో పోల్చితే భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న 42వేల 766 కేసులు నమోదు అయితే.. తాజాగా 41వేయి 5వందల 6కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 18లక్షల 43 శాంపిల్స్ నిర్వహించగా వారిలో 41 వేల 506 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక మరణాల సంఖ్య కాస్త తగ్గింది. అంతకుముందు రోజు 1200 మరణాలు నమోదు కాగా.. తాజాగా 895 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4 లక్షలు దాటింది. మరోవైపు... కరోనా నుంచి కోలుకుని మరో 41 వేల 526 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3 కోట్లకు చేరువలో ఉంది. దీంతో రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4 లక్షల 54 వేల 118 యాక్టివ్ కేసులున్నాయి. ఆ రేటు 1.47 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 97.20శాతానికి పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. మరోవైపు.. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 37 కోట్లు పంపిణీ చేసినట్టు కేంద్రం పేర్కొంది. 

Tags:    

Similar News