ప్రదాని, కేంద్ర మంత్రులకు జగన్ కితాబు

గాల్వాన్ లో బారత్, చైనా ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం అనంతరం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

Update: 2020-06-21 12:40 GMT

గాల్వాన్ లో బారత్, చైనా ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం అనంతరం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. చైనా సైనికులు భారత భూభాగంలోకి ఎలా ప్రవేశించారని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అలాగే పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా స్వరం కలిపారు. అయితే బీజేపీ సభ్యులు కూడా వీటికి ప్రతివిమర్శలు చేశారు.

ఈ విమర్శలు ప్రతివిమర్శలను తప్పుబట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ రెడ్డి. ఇది విమర్శల సమయం కాదని, దేశం కోసం అంతా ఐక్యంగా ఉండవలసిన సమయమన్నారు. చైనా దాడి పై ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రదాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు సంతృప్తికరమైన రీతిలో సమాధానాలు ఇచ్చారని జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అంతా కలిసికట్టుగా ఉండాలని.. ఐక్యత బలాన్ని తెస్తుందని.. విభజన బలహీనతను ప్రదర్శిస్తుందని అన్నారు.


Tags:    

Similar News