రాష్ట్రాలకు ఆర్‌బీఐ ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం : నిర్మలా సీతారామన్‌

కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం ప్రకటించిన విషయం విదితమే.

Update: 2020-05-17 14:03 GMT
Nirmala Sitharaman (File Photo)

కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆఖరి విడత కేటాయింపులను వెల్లడించారు.

రాష్ట్రాల విపత్తు నిర్వహణ కోసం నిధులు విడుదల చేస్తూనే ఉన్నామని, ఏప్రిల్‌ నుంచి రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు... కరోనా వల్ల కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా భారీగా ఆదాయా వనరులు కోల్పోయాయని,

రాష్ట్రాలను ఆదుకోవడానికి నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల రుణపరిమితిని జీఎస్‌డీపీలో మూడు నుంచి ఐదు రాష్ట్రాలశాతానికి పెంచామని, రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ.4.28లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తున్నట్లు నిర్మల సీతారామన్ అన్నారు.

ఏప్రిల్‌ నుంచి రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు విడుదల

♦ రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.12,390 కోట్లు విడుదల

♦ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.11,092 కోట్లు విడుదల

♦ నిధుల కొరత ఉన్న రాష్ట్రాలకు ఆర్‌బీఐ ద్వారా నిధులు

♦ కేంద్రం రాష్ట్రాలకు ఆర్‌బీఐ ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం

♦ త్రైమాసికంలో రాష్ట్రాల ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితి 32 రోజుల నుంచి 50 రోజులకు పెంపు

♦ రాష్ట్రాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిమితిని ఆర్‌బీఐ 60శాతం పెంచిందన్నారు.

♦ రాష్ట్రాలకు అందుబాటులోకి తెచ్చిన రుణాల్లో కేవలం 14 శాతం మాత్రమే వినియోగించుకున్నాయి.

♦ రాష్ట్రాలు వినియోగించుకుంది పోనూ రూ.4.28లక్షల కోట్లు రుణాల రూపంలో అందుబాటు. 

Tags:    

Similar News