Old Pension: పాతపెన్షన్ పునరుద్దరణపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉత్కంఠకి తెర..!

Old Pension: పాతపెన్షన్ పునరుద్దరణపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉత్కంఠకి తెర..!

Update: 2022-03-18 07:00 GMT

Old Pension: పాతపెన్షన్ పునరుద్దరణపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉత్కంఠకి తెర..!

Old Pension: ప్రస్తుతం పాత పెన్షన్‌ స్కీంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు OPSని అమలు చేశాయి. అందులో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ముందు వరుసలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ (ఓపీఎస్)ని పునరుద్ధరించే ప్రతిపాదన ప్రభుత్వం నుంచి లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఉత్కంఠకి తెర దించింది.

వాస్తవానికి OPM అమలుకు సంబంధించిన ప్రశ్నను పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీ అడిగారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కేంద్ర ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తుందా అని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 23న బడ్జెట్‌లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. అయితే జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత ఉద్యోగాలు ప్రారంభించిన వ్యక్తులకి ఈ ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విధానంపై ఎటువంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు. 

అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని NDA ప్రభుత్వం 2003లో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. అనంతరం అధికారం నుంచి వైదొలగడానికి ఒక నెల ముందు 1 ఏప్రిల్ 2004న ప్రస్తుత జాతీయ పెన్షన్ పథకాన్ని (NPS) ప్రారంభించింది. ఈ రోజుల్లో పాత పెన్షన్ స్కీమ్‌పై రాష్ట్ర స్థాయిలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఒకే వేదికపైకి వచ్చారు. 2010 తర్వాత ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకం కింద ఉద్యోగులను నియమించింది. పాత పథకంతో పోలిస్తే ఈ పథకంలో ఉద్యోగులకు చాలా తక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.

Tags:    

Similar News