CBSE Exams 2021: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
CBSE Exams 2021: కరోనా సెకండ్ వేవ్‌తో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దయ్యాయి.
CBSE Exams 2021: కరోనా సెకండ్ వేవ్‌తో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దయ్యాయి. ఈ పరీక్షలను చేపట్టేందుకు గత కొద్ది రోజులుగా చర్చలు జరిపిన కేంద్రం... ఎట్టకేలకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో ప్రకటించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్ష రాసేందుకు బలవంతం చేయకూడదని ప్రధాని మోదీ సూచించారు.
పరీక్షలు రాయాలనుకునే వారికి దేశంలో కరోనా పరిస్థితులు తగ్గాక ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు పెట్టనున్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం విధితమే. అలాగే, ఫలితాల వెల్లడి విషయంలో అబ్జెక్టివ్ విధానాన్ని అమలుచేయనున్నట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ఫలితాలను ప్రకటించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.