తడోబా అభయారణ్యంలో నల్ల చిరుత
*కొలారా గేటు దగ్గర పర్యాటకులకు కనిపించిన నల్ల చిరుత
Tadoba: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన తడోబా అభయారణ్యంలో పర్యాటకులకు నల్ల చిరుత కనిపించింది. ముంబయి నుంచి వచ్చిన పర్యాటకులు అభయారణ్యంలోని కొలారా ద్వారం గుండా వచ్చేటప్పుడు వారికి కొద్ది దూరంలో నల్ల చిరుత ఎదురయ్యిందని తెలిపారు. అరుదుగా కనిపించే ఇది రెండేళ్ల తరువాత ఇప్పుడే కనిపించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.