UP BJP leader slams cops: మాస్క్ ధరించండి అన్నందుకు పోలీసులనే చితకొట్టిన బీజేపీ నేత
UP BJP leader slams cops: ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు పోలీసులపైనే ఓ బీజేపీ నేత, అతని కుమారుడు కలిసి దాడికి తెగబడ్డారు.
UP BJP leader thrash cops: ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు పోలీసులపైనే ఓ బీజేపీ నేత, అతని కుమారుడు కలిసి దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. శుక్రవారం రాత్రి వారణాసిలోని సుందర్‌పూర్ ప్రాంతంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురు పోలీసు సిబ్బందిని కొట్టడంతో బిజెపి నాయకుడు సురేంద్ర పటేల్, ఆయన కుమారుడు వికాస్‌ను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రభాకర్ చౌదరి ధృవీకరించారు. "పోలీసు సిబ్బందితో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాము. ఈ ఘటనలో పాల్గొన్న మరో ఐదుగురిని అరెస్టు చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు. బీజేపీ నేత సురేందర్ పటేల్ అతని కుమారుడు వికాస్ ముఖాలకు మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నారు. వీరిని గమనించిన స్థానిక పోలీసులు వారి వద్దకు వెళ్లి మాస్కులు పెట్టుకోవాలని సూచించారు.
ఈ క్రమంలో తండ్రీకొడుకులు పోలీసులతో వాగ్విదావడానికి దిగారు.. ఎంత సర్ది చెప్పిన వినకుండా అక్కడున్న ముగ్గురు పోలీసు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు కొందరు యువకులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. దాడికి గురైన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. దీంతో పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సురేంద్ర పటేల్, వికాస్ పటేల్ తో పాటు అహ్సోక్ పటేల్, సంతోష్ పటేల్, బిందు పటేల్, గోలు యాదవ్, ఖీతాన్ రాజ్‌భర్ దాడికి పాల్పడిన వారుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై వారణాసి బీజేపీ చీఫ్ మహేష్ చంద్రా శ్రీవాస్తవా మాట్లాడుతూ.. పోలీసులపై దాడికి పాల్పడటం సరైనది కాదని అన్నారు. ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.