Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం
Maharashtra: తనవర్గం ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. శరద్ పవార్ పై తిరుగుబావుట ఎగురవేసిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంలో చేరారు. 13 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన శిండే ప్రభుత్వంలో చేరినట్లు ప్రకటించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.