Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Maharashtra: నాగపూర్ జిల్లా పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ * ఈ నెల 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్
Maharashtra: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాగపూర్ జిల్లా పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించింది. ఈ నెల 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.